కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-12-09T00:52:55+05:30 IST

కుటుంబ కలహాల కారణంగా కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గురువారం కాపాడారు.

కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం
గోపీని తీసుకొస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

కాపాడిన ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

విజయవాడ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల కారణంగా కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గురువారం కాపాడారు. ప్రసా దంపాడుకు చెదిన కె.గోపికి భార్యతో వివాదాలు ఉన్నాయి. ఇంటి నుంచి బైక్‌పై బయటకు వచ్చాడు. మద్యం దుకాణంలో మద్యం తాగి గురువారం ప్రకాశం బ్యారేజ్‌ మీదకు వెళ్లాడు. 61వ నంబర్‌ గేటు వద్ద నుంచి నదిలోకి దూకాడు. దుర్గా ఘాట్‌లో ఉన్న ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందడంతో ఇన్‌చార్జి ఎం.లోకేష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది నదిలో బోటుపై ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని గోపీని ప్రాణాలతో తీసుకొచ్చారు. అనంతరం వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2022-12-09T00:52:56+05:30 IST