తొలిసారె తెస్తిమమ్మా..

ABN , First Publish Date - 2022-07-01T06:31:56+05:30 IST

తొలిసారె తెస్తిమమ్మా..

తొలిసారె తెస్తిమమ్మా..
తొలిసారె తీసుకెళ్తున్న మహిళలు

 ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం

వన్‌టౌన్‌, జూన్‌ 30 : ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సంబరాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ ఆఽధ్వర్యంలో తొలి సారెను అందజేశారు. తొలుత ఆలయ వైదిక, అర్చక సిబ్బంది, భక్తులు కనకదుర్గానగర్‌లోని గోశాల నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఆలయానికి చేరుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ అమ్మవారికి తొలిసారె సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, తాళ్లాయపాలెం శైవక్షేత్రానికి చెందిన శివస్వామి దుర్గమ్మకు సారె సమర్పించారు. వారికి ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివస్వామి ఆషాఢమాస విశిష్టత, అమ్మవారి వైభవాన్ని అనుగ్రహ భాషణం చేశారు. 
Updated Date - 2022-07-01T06:31:56+05:30 IST