అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

ABN , First Publish Date - 2022-02-23T05:55:20+05:30 IST

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు, సీఐటీయూ నాయకులు

కంకిపాడు, ఫిబ్రవరి 22 : న్యాయమైన సమస్య లు పరిష్కరించాలని పోరాడుతున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేసి ఉద్యమాన్ని  ఆపలేరని ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకురాలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరు స్వరూపరాణి అన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున దావు లూరు టోల్‌గేట్‌ వద్ద మోహరించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌కు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. కమల  ఆశా వర్కర్లతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో దావులూరు టోల్‌గేట్‌ వద్ద అరెస్టు చేసి కంకిపాడు పోలీసుస్టేషన్‌ తరలించారు. సమా చారం అందుకున్న ఆశా వర్కర్లు, సీఐటీయూ నాయకులు కంకిపాడు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడు తూ ఆశా వర్కర్లు న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్ర మాలను అడ్డుకోవటం దుర్మార్గమన్నారు.  ఆశా వర్కర్లను అరెస్టుల ద్వారా అడ్డుకుందామని చూస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అరెస్టు చేసిన ఆశా నాయకురాళ్లు కమల, విజయకుమారి, సీహెచ్‌ సంధ్యారాణి, వి. దుర్గ, ఎ. కనకమ్మ, రాణి, భవానీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి. మహాలక్ష్మి, శిరీష, యశోద, సుజాత, ఈశ్వరమ్మ, సుధారాణి, శైలజ, పార్వతి, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి మరియదాసు, రైతు సంఘం మండల కార్యదర్శి వి. శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం 

ఆశా వర్కర్లకు మద్దతుగా నిలిచిన పలు ప్రజా సంఘాల ప్రతినిధులను ముందస్తుగానే హౌస్‌ అరెస్టులు చేయటం అప్రజాస్వామి కమని సీపీఎం జిల్లా నాయకులు పంచకర్ల రంగారరావు అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మంగళవారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని నీరు కార్చేందుకు సీపీఎం, సీఐటీయూ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయటం సిగ్గుచేటన్నారు. 


Read more