వీరులపాడు మండల కేంద్రం తరలింపుపై ఆగ్రహ జ్వాల

ABN , First Publish Date - 2022-12-15T00:35:10+05:30 IST

వీరులపాడు మండల కేంద్రం మార్పుపై నిరసనలు మొదలయ్యాయి.

వీరులపాడు మండల కేంద్రం తరలింపుపై  ఆగ్రహ జ్వాల
వీరులపాడులో దిష్టిబొమ్మ దహనం చేస్తున్న యువకులు

వీరులపాడు, డిసెంబరు 14 : వీరులపాడు మండల కేంద్రం మార్పుపై నిరసనలు మొదలయ్యాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణకుమార్‌ దిష్టిబొమ్మలను నిరసనకారులు దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రాన్ని వీరులపాడు నుంచి జుజ్జూరుకు తరలించే యత్నాన్ని విరమించుకోవాలన్నారు. స్థానిక యువకులు కొందరు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేసి, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనలో 19 మందిపై కేసు నమోదు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ నాగేంద్రకుమార్‌ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నడుచుకుంటే చర్యలు తప్పవని ఏసీపీ నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-15T00:35:11+05:30 IST