-
-
Home » Andhra Pradesh » Krishna » Anarchy is the brain of the people-NGTS-AndhraPradesh
-
అరాచకపాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2022-10-01T06:32:38+05:30 IST
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్యకు

పెనుగంచిప్రోలు, సెప్టెంబరు 30 : హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్యకు నిరసనగా పెనుగంచిప్రోలు పాత సినిమాహాల్ సెంటర్లో శుక్రవారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. జగన్కు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య, మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, అత్తలూరి అచ్యుతరావ్, వాసిరెడ్డి బెనర్జీ, గజ్జి కృష్ణమూర్తి, కర్ల వెంకట నారాయణ, నూతలపాటి చెన్నకేశవరావు, చింతా వెంకటేశ్వరరావు (బుల్లి)పాల్గొన్నారు.