కానిస్టేబుల్‌ అభ్యర్థులకు వయోపరిమితి పెంచండి

ABN , First Publish Date - 2022-12-13T00:48:32+05:30 IST

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమతి ఐదేళ్లు పెంచాలని డీవైఎ్‌ఫఐ, ఏఐవైఎఫ్‌ నిరుద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో ధర్నా చేసేందుకు వస్తున్న ఆయా సంఘాల నేతలు, నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు వయోపరిమితి పెంచండి
విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ధర్నాచౌక్‌, డిసెంబరు 12 : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమతి ఐదేళ్లు పెంచాలని డీవైఎ్‌ఫఐ, ఏఐవైఎఫ్‌ నిరుద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో ధర్నా చేసేందుకు వస్తున్న ఆయా సంఘాల నేతలు, నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా అనుమతించరా? అంటూ ప్రశ్నించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీ్‌సశాఖలో ఖాళీగా ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయోపరిమితి 27 ఏళ్లలోపు ఉండాలని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. వయోపరిమితి 32 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం 2016-18లో నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. నోటిఫికేషన్ల మధ్య వ్యత్యాసాన్ని బట్టి అభ్యర్థుల వయోపరిమితి పెంచేవారని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి జాబ్‌ క్యాలండర్‌ ప్రకటించి మూడేళ్ల తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌ వయోపరిమితి విషయంలో పునరాలోచన చేసి 32 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ కానిస్టేబుల్‌ పోస్టులకు 24 ఏళ్ల వరకు ఉండటంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసి డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజేసి బోర్డు చైర్మన్‌, హోం మంత్రికి ఫార్వర్డ్‌ చేయాలని కోరామన్నారు. రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి, హోంమంత్రి తానేటి వనితను కలిసినా ఐదేళ్ల వయోపరిమితిపై హామీ రాకపోవడంతో నిరుద్యోగులు, ఆయా సంఘాల నేతలు రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.కృష్ణ, ఎన్‌.నాగేశ్వరరావు, కృష్ణకాంత్‌, టి.బాజీ, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్‌ సుభానీ, జంగాల చైతన్య, లంకా గోవింద్‌, బేవర శ్రీను లంకె సాయి, నాని, అయ్యప్ప పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.

అరెస్టులు సరైంది కాదు : ఎస్‌ఎ్‌ఫఐ

కానిస్టేబుల్‌ పోస్టుల అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి పెంచాలని ఆందోళన చేస్తున్న డీవైఎఫ్‌ఐ నేతలు, నిరుద్యోగులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అద్యక్షుడు ఎం.సోమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వయోపరిమితిని పెంచితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-13T00:48:33+05:30 IST