ఆదర్శనీయుడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2022-12-07T00:47:00+05:30 IST

సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన ఆదర్శనీయుడు బీఆర్‌ అంబేడ్కర్‌ అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శ్లాఘించారు. మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భగా కామయ్యతోపు వద్ద ఉన్న అంబేడ్కరే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.

 ఆదర్శనీయుడు అంబేడ్కర్‌
గన్నవరంలో అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బచ్చుల అర్జునుడు

పెనమలూరు, డిసెంబరు 6 : సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన ఆదర్శనీయుడు బీఆర్‌ అంబేడ్కర్‌ అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శ్లాఘించారు. మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భగా కామయ్యతోపు వద్ద ఉన్న అంబేడ్కరే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, కుర్రా నరేంద్ర, అంగిరేకుల మురళి, కొండ్రు కోటేశ్వరరావు, పీతా గోపి, మల్లంపాటి విజయలక్ష్మి, బొంగరాల అబ్రహాం, హాజీ ఇమాం, దండమూడి సాయిసుధ, కె. పవన్‌ పాల్గొన్నారు.

ఫ తాడిగడప మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనరు ప్రకాశరావు ఆధ్వర్యంలో బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్ర పటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం లో మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కంకిపాడు : రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పులి కామే శ్వరరావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సంద ర్భంగా స్థానిక లాకు రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళలర్పించారు. జనసేన పార్టీ నాయ కులు ముప్పా రాజా, బాయిన నాగరాజు, సుంకర సురేష్‌, పిచుక రవి, కుంటా గంగాధర్‌, దాసరి కరుణ, తోట సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యూరు : బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి ఉయ్యూ రు, మండల పరిధి గ్రామాల్లో మంగళవారం నిర్వ హించారు. ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి ఆర్డీవో ఎన్‌.విజయ్‌కుమార్‌ పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ భరత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి భాస్కర్‌, రాజులపాటి ఫణి, అజ్మతుల్లా పూలమాల వేసి నివాళులర్పించారు. 4వ వార్డులో నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ సోలె సురేశ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

గన్నవరం : ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ మండ ల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, మేడేపల్లి రమా దేవి, జాస్తి శ్రీధర్‌, చిరుమామిళ్ల సూర్యం, నాగయ్య, జూపల్లి సురేష్‌, వెంకటేశ్వరరావు, శ్రీని వాసరావు, సోమేశ్వరరావు నితీష్‌కుమార్‌, శేషు, కోటి తదితరులు పాల్గొన్నారు. ఫ కేసరపల్లి పంచాయతీ కార్యాల యంలో సర్పంచ్‌ చేబ్రోలు లక్ష్మీమౌనిక, కార్యదర్శి మౌనిక అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్‌, మాలమహానాడు, ఎంఈఎఫ్‌ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేశారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : బాపులపాడు మం డల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో మంగళవారం డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిం చారు. టీడీపీ మండల కార్యాలయంలో అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమావరప్రసాద్‌, తదితరులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములపల్లి శ్రీనివాసరావు, యలమంచలి మూర్తి, మొవ్వా వెంకటేశ్వరరావు, చెన్నుబో యిన శివయ్య, తుమ్మల జగన్‌, మజ్జిగ నాగరాజు, యార్లగడ్డ సత్యనారాయణ పాల్గొన్నారు. సీతామహాలక్ష్మి నర్సింగ్‌ హోమ్‌లో బాపులపాడు సర్పంచ్‌ సరిపల్లి కమలా కిరణ్‌, డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. వీరవల్లిలో మాజీ సర్పంచ్‌ పిల్లా రామారావు, మండాది రవీంద్ర అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. వేలేరు హైస్కూల్‌లో హెచ్‌ఎం విజయ్‌ ఆధ్వర్యంలో జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు వీరాబత్తిన అమలదాసు, కన్వీనర్‌ ముత్యాల కిరణ్‌ తదితరులు అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. పెరికీడులో అంబే డ్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ పల్లపోతు జాన్‌ప్రకాష్‌, మజ్జి దీవెనకుమార్‌, మాజీ సర్పంచ్‌ తవ్వా మూర్తి తదితరులు నివాళులర్పించారు. ప్రత్తిపాటి జోగేశ్వరరావు, కుమార స్వామి పాల్గొన్నారు.

విజయవాడ రూరల్‌ : పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని మాజీ ఎంపీపీ నాగిరెడ్డి అన్నారు. నున్న పంచాయతీ కార్యాలయంలో మంగ ళవారం అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంబేడ్కర్‌ చిత్రప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బ్రహ్మానందరెడ్డి, ఈవో వెంకట రమణ, నేతలు హనుమ, కాటూరి శ్రీను, ముత్తారెడ్డి, శివరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:47:04+05:30 IST