గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-08T06:09:36+05:30 IST
గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి

పాయకాపురం, ఆగస్టు 7: సభ్య సమాజం తలదించుకునేలా మహిళతో వీడి యోకాల్లో నగ్నంగా మాట్లాడిన ఎంపీ గోరం ట్ల మాధవ్ వ్యవహారాన్ని కేంద్రం సుమో టోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవా లని, పదవి నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ సెంట్రల్ మహిళా కమిటీ డిమాండ్ చేసింది. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చో బెట్టిన చందాన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధోరణి ఉందని సభ్యులు విమర్శించారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం వద్ద ఆదివారం వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ మాధవ్ ఫ్లెక్సీలను మహిళలు చెప్పులతో కొట్టి, తగులబెట్టారు. మాధవ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఇంత వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోక పోవడం సీఎం జగన్‌కు మహిళలపై ఉన్న చిన్నచూపును తెలియజేస్తోందన్నారు. సిగ్గుమాలిన పనికి పశ్చాత్తాపపడి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాసరి ఉదయశ్రీ, తిరువీధుల మురళీదేవి, మాదాల సత్య, బేబి సరోజిని, గరిమెళ్ల రాధిక, గరిమెళ్ల నాగ మణి, శొంఠి ఈశ్వరి, శిరీష, మల్లీశ్వరి, అరుణ, రమణమ్మ పాల్గొన్నారు.