అంతిమ విజయం అమరావతి రైతులదే: ఆళ్ల గోపాలకృష్ణ
ABN , First Publish Date - 2022-03-04T06:40:17+05:30 IST
అంతిమ విజయం అమరావతి రైతులదే: ఆళ్ల గోపాలకృష్ణ
హనుమాన్‌జంక్షన్ రూరల్, మార్చి 3: అంతిమ విజయం అమరావతి రైతులదేనని, ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చుకోవచ్చనే వారికి హైకోర్టు తీర్పు చెంప పెట్టని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అమరావతి జేఏసీ కో-కన్వీనర్ ఆళ్ల గోపాలకృష్ణ అన్నారు. రంగన్నగూడెంలో రాజధానిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూగురువారం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఇకనైనా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు పిచ్చిపిచ్చి ప్రేలాపనలు మాని టీడీపీ హయాంలో 90శాతం చేసిన పనులను పూర్తిచేసి అమరావతిని అభివృద్ధి వైపు అడుగులు వేయించాలని ఆళ్ల సూచించారు. అమరావతి రైతుల తరఫున వాదనలు వినిపించి పోరాడిన న్యాయవాదులకు జేఏపీ తరఫున అభినందనలు తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ, జేఏసీ నేతలు కసుకుర్తి అర్జునరావు, మొవ్వా శ్రీనివాసరావు, కనకవల్లి శేషగిరిరావు, నెరుసు తాతయ్య, ఆనంద్‌బాబు, వీరవల్లి ఎంపీటీసీ సభ్యుడు అమృతపల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు.