లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-19T06:16:37+05:30 IST

లారీ ఢీకొని యువకుడి మృతి

లారీ ఢీకొని యువకుడి మృతి

విద్యాధరపురం, సెప్టెంబరు 18: గొల్లపూడి వన్‌సెంటర్‌ సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో బాపట్ల జిల్లా రేపల్లె మండలం రాజుకాలువకు చెందిన మేడికొండ హేమంత్‌(20) తీవ్రగాయాల పాలయ్యాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజుపాలేనికి చెందిన చాట్రగడ్డ సుమన్‌ భవానీపురం పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. సుమన్‌ ఐటీసీ బుక్స్‌ కంపెనీలో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు కంపెనీలో హెల్పర్‌గా హేమంత్‌ పనిచేస్తున్నాడు. వీరు అద్దెకు ఉంటున్నారు. వన్‌సెంటర్‌ కర్రీస్‌ పాయింట్‌కు వెళ్లారు. అక్కడ అది మూసి ఉండడంతో మరొక కర్రీస్‌ పాయింట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా వెనక నుంచి కేఏ 25 ఏఏ 6690 నెంబరు లారీ వేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ కిందపడిపోయారు. హేమంత్‌ కంటికి, నడుముకు, పక్కటెముకలకు తీవ్రగాయాలయ్యాయి. సుమన్‌కు కుడి మోకాలుకు చిన్న గాయమైంది. హేమంత్‌ను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 


Read more