మురుగుబోదెలోకి దూసుకెళ్లిన టిప్పర్‌

ABN , First Publish Date - 2022-12-16T01:29:22+05:30 IST

చల్లపల్లి-నడకుదురు ప్రధాన రహదారిలో రాముడుపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఇసుక టిప్పర్‌ మురుగుబోదెలోకి కొంతభాగం దూసుకెళ్లి ఆగింది. టిప్పర్‌ ఎడమ(ముందు)టైరు మార్జిన్‌ దిగ డంతో అదుపుతప్పగా, డ్రైవర్‌ చాకచక్యంగా ఆపాడు.

 మురుగుబోదెలోకి దూసుకెళ్లిన టిప్పర్‌

చల్లపల్లి, డిసెంబరు 15: చల్లపల్లి-నడకుదురు ప్రధాన రహదారిలో రాముడుపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఇసుక టిప్పర్‌ మురుగుబోదెలోకి కొంతభాగం దూసుకెళ్లి ఆగింది. టిప్పర్‌ ఎడమ(ముందు)టైరు మార్జిన్‌ దిగ డంతో అదుపుతప్పగా, డ్రైవర్‌ చాకచక్యంగా ఆపాడు. వెనుక టైర్లు రోడ్డులో కూరుకుపోవడంతో కొంతమేర ముందుకువెళ్లి నిలిచిపోయింది. నడకుదురు రోడ్డులో ఇసుక టిప్పర్ల రాకపోకలు ఎక్కువగా ఉండడం, సింగిల్‌ లైన్‌ రహ దారి కావటంతో ఎదురుగా పెద్ద వాహనాలు వస్తున్నప్పుడు మార్జిన్‌ దిగాల్సి వస్తోంది. పరిమితికి మించిన లోడులతో టిప్పర్లు ప్రయాణి స్తుండటం, మార్జిన్‌ దిగుతుండటంతో కొత్తరోడ్డులో పలు చోట్ల టిప్పర్ల కార ణంగా తారురోడ్డు మార్జిన్‌ కుంగుతోంది.

Updated Date - 2022-12-16T01:29:23+05:30 IST