ఘనంగా అఖండ జ్యోతుల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-12-12T00:35:04+05:30 IST

కొత్తపేట బావిపంపుల సెంటర్‌ వద్ద ఆదివారం అఖండ జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు,

ఘనంగా అఖండ జ్యోతుల ఊరేగింపు
కొత్తపేటలో అఖండ జ్యోతుల ఊరేగింపు

ఘనంగా అఖండ జ్యోతుల ఊరేగింపు

వన్‌టౌన్‌,డిసెంబరు 11: కొత్తపేట బావిపంపుల సెంటర్‌ వద్ద ఆదివారం అఖండ జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురుభవాని అడ్డూరి రామచంద్రరావు ఆశీస్సులతో ఆయన కుమారుడు జానకి మల్లేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్‌, మహదేవు అప్పాజీరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షాధారులు, భవానీ దీక్షాధారులు పాల్గొన్నారు. పూజాదికాల అనంతరం జ్యోతుల ఊరేగింపును నిర్వహించారు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణతో భక్తి ప్రపత్తులతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2022-12-12T00:35:04+05:30 IST

Read more