ఐదుగురికి కరోనా
ABN , First Publish Date - 2022-03-05T06:00:56+05:30 IST
ఐదుగురికి కరోనా
విజయవాడ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా ఐదుగురు కరోనా బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,833కు పెరిగింది. మరణాలు 1,496 వద్ద నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 183 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 1,35,154 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.