217 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-13T06:05:30+05:30 IST
217 కరోనా కేసులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కరోనా కాలనాగు మళ్లీ పడగ విప్పి జిల్లాను కమ్మేస్తోంది. రోజురోజుకూ కోరలు చాచి జనంపై విషం చిమ్ముతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 217 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలేమీ నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,21,725కు ఎగబాకాయి. మరణాలు 1,481 వద్ద నిలకడగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్ బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,19,236 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 1,008 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, జిల్లాలో ఒమైక్రాన్‌తో పాటు డెల్టా వైరస్ కూడా వ్యాప్తి చెందుతు న్నప్పటికీ గతంలో మాదిరిగా పాజిటివ్ బాధితుల్లో దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదని, ఎక్కువ మందిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రాణనష్టం ఎక్కువగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.