11 డయేరియా కేసులు

ABN , First Publish Date - 2022-07-20T06:06:32+05:30 IST

11 డయేరియా కేసులు

11 డయేరియా కేసులు

తెంపల్లిలో విస్తృతంగా ఇంటింటి సర్వే 

గన్నవరం, జూలై 19 : తెంపల్లిలో కొత్తగా 11 డయేరియా కేసులు నమోదైనట్లు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ గీతాభాయి తెలిపారు. గ్రామంలో మంగళవారం వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. ఈ సర్వే బృందాలకు గీతాభాయి సూచనలు చేశారు. ఈ సర్వేలో 11 మంది బాధితులను గుర్తించగా, వారికి స్థానికంగానే వైద్య సేవలు అందించారు. ఇప్పటివరకు మొత్తం 126 డయేరియా కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు. కొంతమంది పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలతో పంచాయతీలో కొత్త పైపులైన్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామస్తులందరికీ ఆర్వో వాటర్‌ను సరఫరా చేస్తున్నారు. మూడు వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి జేవీ నామేశ్వరరావు, ఎంపీపీ అనగాని రవి, ఎంపీడీవో వై.సుభాషిణి, సర్పంచ్‌ కొలుసు శిరీష, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ భారతి, డీపీఎం కె.సుదర్శన్‌ బాబు, డాక్టర్‌ అపర్ణ, డాక్టర్‌ మనోహర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

Read more