వైఎస్సార్‌ జయహో బీసీ సభ కపటమే : తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-12-07T23:30:54+05:30 IST

బీసీల ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ కపట ప్రేమ ఒలక బోస్తున్నామని, మొసలి కన్నీరు కారుస్తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా చైర్మన్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి పే ర్కొన్నారు.

వైఎస్సార్‌ జయహో బీసీ సభ కపటమే : తులసిరెడ్డి

వేంపల్లె, డిసెంబరు 7: బీసీల ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ కపట ప్రేమ ఒలక బోస్తున్నామని, మొసలి కన్నీరు కారుస్తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా చైర్మన్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి పే ర్కొన్నారు. బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్‌ ఒక్కటే అన్నారు. 1970లోనే కాంగ్రెస్‌ పార్టీ విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 26శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. టీడీపీ ఏర్పాటు తర్వాత 1993 లో కాంగ్రెస్‌ స్థానిక సంస్థలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. వైసీపీ పుట్టకముందే 2008లో కాంగ్రెస్‌ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నాలుగు బీసీ కమిషన్లు, సచివాలయంలో బీసీ డిపార్ట్‌మెంట్‌, హాస్టల్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వని కారణంగా అవి ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యాయన్నారు. జయహో బీసీ సందర్భంగానైనా ఒక్కో కార్పొరేషన్‌కు రూ.100కోట్లు విడుదల చేయాలని, సీఎం, పార్టీ అధ్యక్ష పదవుల్లో ఒక దానిని బీసీలకు కేటాయించాలని కోరారు.

Updated Date - 2022-12-07T23:30:57+05:30 IST