వైసీపీ పాలన నిరుద్యోగులకు శాపం

ABN , First Publish Date - 2022-12-15T23:12:06+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పరిపాలన నిరుద్యోగులకు శాపంగా మారిందని డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు డేవిడ్‌ రాజ్‌ తెలిపారు.

వైసీపీ పాలన నిరుద్యోగులకు శాపం
గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 15: రాష్ట్రంలో వైసీపీ పరిపాలన నిరుద్యోగులకు శాపంగా మారిందని డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు డేవిడ్‌ రాజ్‌ తెలిపారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీలో పోస్టుల సంఖ్యను పెంచాలని గురువారం డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నాలుగేళ్లగా నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, వయో పరిమితిని ఐదేళ్లకు పెంచాల ని కోరారు. సిలబస్‌ భారీగా ఉన్నందున ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు నెలలు గడువు పెంచాలని కోరారు. పోస్టుల సంఖ్య పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ నేతలు నరసింహా, సురేష్‌, ఓబులేసు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:12:08+05:30 IST