వైసీపీ శవ రాజకీయాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T04:58:04+05:30 IST

దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్‌.టి.ఆర్‌ కుమార్తె ఉమా మహే శ్వరి మరణంపై సోషల్‌మీడియాలో శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డితో పాటు, అప్ర తిష్ట కలిగించే రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌ ఆధ్వ ర్యంలో గురువారం రాజం పేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వైసీపీ శవ రాజకీయాలపై చర్యలు తీసుకోవాలి
రాజంపేట: ఫిర్యాదు చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

రాజంపేట, ఆగస్టు4 : దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్‌.టి.ఆర్‌ కుమార్తె ఉమా మహే శ్వరి మరణంపై సోషల్‌మీడియాలో శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డితో పాటు, అప్ర తిష్ట కలిగించే రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌ ఆధ్వ ర్యంలో గురువారం  రాజం పేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగు మహిళా పార్లమెంట్‌ అధ్యక్షురాలు అనసూయమ్మ, టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు పోలి శివ కుమార్‌, తెలుగు యువత నాయకులు రమణ, హరీష్‌, శివరామ్‌, బాషా, నరసింహ, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రైల్వేకోడూరు రూరల్‌:  ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని రైల్వేకోడూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడుతూ సోషల్‌ మీడియా వే దికగా ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయం చేస్తున్న వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌, ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వేకోడూరు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మశివ, ఓబుల వారిపల్లి అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు మహిళా కమిటీ అధ్యక్షురాలు హస్తి సుప్రజ, కటికం సునీ త, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు పుల్లెల రమేష్‌, ఎస్సీ నాయకులు చిన్నా, హస్తి చంద్రరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-05T04:58:04+05:30 IST