అక్రమలేఔట్లు వేయడంలో వైసీపీ నాయకులు దిట్ట

ABN , First Publish Date - 2022-11-24T23:51:19+05:30 IST

మదనపల్లె పరిసరప్రాంతాల్లో అక్రమలేఔట్లు వేయడంలో వైసీపీ నాయకులు దిట్ట అని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు.

అక్రమలేఔట్లు వేయడంలో వైసీపీ నాయకులు దిట్ట
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కార్యదర్శి శ్రీనివాసులు

మదనపల్లె, అర్బన, నవంబరు 24: మదనపల్లె పరిసరప్రాంతాల్లో అక్రమలేఔట్లు వేయడంలో వైసీపీ నాయకులు దిట్ట అని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువా రం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాయి తీ గురించి మాట్లాడే శాసనసభ్యుడు ఎలాంటి అనుమతులు లేకుండా ఓ రెస్టారెంట్‌ను ప్రారం భానికి ఏవిధంగా సహకరిస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు తట్టిశ్రీనివా సులు రెడ్డి, జడ్పీటీసీ ఉదయ్‌కుమార్‌, అయూబ్‌, కత్తిరాజు తదితరులు వేంపల్లె, రామా చార్లపల్లె, నేతాజీ కాలనీ, సీటీఎం ప్రాంతాల్లో వేసినవి అక్రమలేఔట్లు కావా అన్నారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని అక్రమలేఔట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలను కూడగట్టి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:51:19+05:30 IST

Read more