వైసీపీది ఆరాచక పాలనే
ABN , First Publish Date - 2022-12-31T23:12:26+05:30 IST
రాష్ట్రంలో వైసీపీది ముమ్మాటికి అరాచక పాలనే అని రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇనచార్జి గంటా నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 31: రాష్ట్రంలో వైసీపీది ముమ్మాటికి అరాచక పాలనే అని రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇనచార్జి గంటా నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజంపేట పార్ల మెంట్ పరిధిలోని పుంగనూరు నియోజకవర్గం నంజంపేటలో టీడీపీ ఇనచార్జి చల్లా బాబురెడ్డి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఓర్వలేని వైసీపీ నాయకుడు చల్లా బాబురెడ్డి వర్గీయులపై రాళ్లదాడి చేసి గాయపరచడం రాక్షసులను తలపిం చిందన్నారు. పోలీసులు ఈ దాడులను అరికట్టకుండా ప్రేక్షకపా త్ర పోషించారే కాని, వైసీపీ వర్గీయులను అడ్డుకోలేదన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తూనే వున్నారని, ప్రజలే వైసీపీకి బుద్ధిచెబుతారని నరహరి స్పష్టం చేశారు.
ఉచితవిద్యుతకు మీటర్లు ఎందుకు
రామసముద్రం, డిసెంబరు 31: వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత ఇస్తున్నప్పుడు మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏంటని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధికారప్రతినిధి ఆర్జే వెంకటేష్ ప్రశ్నించారు. శనివారం మండలంలోని కేసిపల్లె పంచా యతీలోని జోగిన్లు, వనగానపల్లె, ఎంబాడీ, కేసిపల్లెలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ గౌడు అధ్యక్షతన ఇదేం ఖర్మ మనరాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, కృష్ణంరాజు, మాజీ జడ్పీటీసీ శివశంకర్, విజయమ్మ, భాస్కర్, రెడ్డెప్పరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు ప్రశాంతరెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.