పేదలను ఆదుకోవడంలో వైసీపీ విఫలం: టీడీపీ

ABN , First Publish Date - 2022-09-14T04:39:14+05:30 IST

పేదలను ఆదుకోవడంలో వైసీపీ పభ్రుత్వం విఫలమైందని టీడీపీ కడప నియోజకవర్గ ఇనచార్జ్‌ అమీర్‌బాబు ధ్వజమెత్తారు.

పేదలను ఆదుకోవడంలో వైసీపీ విఫలం: టీడీపీ
మాట్లాడుతున్న అమీర్‌బాబు

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 13 : పేదలను ఆదుకోవడంలో వైసీపీ పభ్రుత్వం విఫలమైందని టీడీపీ కడప నియోజకవర్గ ఇనచార్జ్‌ అమీర్‌బాబు ధ్వజమెత్తారు. మంగళవారం కడ ప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వాన్ని మైనార్టీలు చీదరించుకుంటున్నారన్నారు. దుల్హన పథకాన్నిదేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా చంద్రబాబు ప్రవే శపెట్టారని చెప్పారు.జగనమోహనరెడ్డి తన మ్యానిఫెస్టోను ఖురాన, బైబిలు, భగవద్గీత లాగా భావిస్తానని పాదయాత్రలో చెప్పినా ఆ మూడింటిని అవమానించేలా జగన ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ, నగర అధ్యక్షులు సానపురెడ్డి శివకొండారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకకుమార్‌, రాష్ట్ర నాయకులు రవిశంకర్‌రెడ్డి, సీఎస్‌ నాసర్‌ ఆలీ, శివ, కొమ్మలపాటి సుబ్బరాయుడు, హమీద్‌బుఖారి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more