వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలి : టీడీపీ

ABN , First Publish Date - 2022-08-05T05:07:10+05:30 IST

ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై శవరాజకీయాలు మానుకోవాలని టీడీపీ నాయకులు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజుకు వినతి పత్రం అందించారు.

వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలి : టీడీపీ
డీఎస్పీ నాగరాజుకు వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 4: ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై శవరాజకీయాలు మానుకోవాలని టీడీపీ నాయకులు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్‌రాయల్‌ , తెలుగుయువత నాయకులు ఐఎల్‌ చిన్న, రాంభూపాల్‌రెడ్డి, సుబ్బరామిరెడి ్డ, నాగేశ్వరరెడ్డి కలిసి విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులు నీచరాజకీయాలు మానుకోవాలన్నారు. నందమూరి కుటుంబం అంటే మచ్చలేనిదని ఉమామహేశ్వరి మరణాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ సోషియల్‌మీడియా బురదజల్లే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జింకల బాష, గణేష్‌, దేవిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఉపేంద్ర, సుభహాన్‌, పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:07:10+05:30 IST