టీడీపీ ప్రజాదరణ చూసి వైసీసీలో ఆందోళన

ABN , First Publish Date - 2022-11-24T23:53:52+05:30 IST

కర్నూలు, ఆదోని పర్యటనలో చంద్రబాబు పర్యటనకు పోటెత్తిన జనసందోహాన్ని చూసి వైసీపీలో ఆందోళన మొదలైందని ఆ పార్టీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు.

టీడీపీ ప్రజాదరణ చూసి వైసీసీలో ఆందోళన

- పార్టీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌రెడ్డి

చెన్నూరు, నవంబరు 24 : కర్నూలు, ఆదోని పర్యటనలో చంద్రబాబు పర్యటనకు పోటెత్తిన జనసందోహాన్ని చూసి వైసీపీలో ఆందోళన మొదలైందని ఆ పార్టీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం చెన్నూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చే యడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వం సాగేందుకు ప్రజల పై ధరల భారం పెంచిందన్నారు. ఆర్టీసీ చార్జీలు, విద్యుత బి ల్లులు పెంచారన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ముస్లింలు, ఎస్సీ ఎస్టీలు ఇలా అన్ని రకాల వర్గాలకు మొండిచేయి చూపారని, మహిళలు సైతం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారన్నారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.మల్లిఖార్జునరెడ్డి, జిల్లా మైనార్టీ నేత షబ్బీర్‌హుసేన, యువనేతలు కల్లూరు ఓబుల్‌రెడ్డి, కొండపేట నారాయణరెడ్డి, ఎస్సీ సెల్‌ నేతలు కొండాల చెన్నయ్య, చెన్నూరు రాంప్రసాద్‌, కమలాపురం సుబ్బరాయుడు, మంజీర్‌ అహ్మద్‌, కొండపేట బాలక్రిష్ణారెడ్డి, ఉండేల శ్రీనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:53:52+05:30 IST

Read more