బస్సులు ఆపాలంటూ విద్యార్థుల ధర్నా, రాస్తారోకో

ABN , First Publish Date - 2022-12-01T23:47:00+05:30 IST

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళుతున్నాయని ఆగ్రహించిన విద్యార్థులు బి.కొత్తకోట-మదనపల్లె మా ర్గంలోని వడిగలవాండ్లపల్లె క్రాస్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు.

బస్సులు ఆపాలంటూ విద్యార్థుల ధర్నా, రాస్తారోకో
బి.కొత్తకోట- మదనపల్లె మార్గంలో ధర్నా చేస్తున్న విద్యార్థులు

బి.కొత్తకోట డిసెంబర్‌ 1 : పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళుతున్నాయని ఆగ్రహించిన విద్యార్థులు బి.కొత్తకోట-మదనపల్లె మా ర్గంలోని వడిగలవాండ్లపల్లె క్రాస్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల కు వెళ్లడానికి బి.కొత్తకోట మండలంలోని కొత్తపల్లె క్రాస్‌, వడిగలవాండ్లపల్లె క్రాస్‌ల వద్ద పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థు లు గురువారం ఉదయం 7.30 నుంచి 9 గంటల దాకా మదనపల్లెకు వెళ్లేందుకు వేచి ఉండి ఆర్టీసీ బస్సులను ఆప కుండా వెళ్లి పోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందో ళన చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని విషయాన్ని మదనపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులు ఇబ్బంది కలుగ కుండా బస్సులను ఖచ్చితంగా ఆపేలా డ్రైవర్లను ఆదేశి స్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

Updated Date - 2022-12-01T23:47:01+05:30 IST