మహిళలు స్వయంశక్తితో రాణించాలి
ABN , First Publish Date - 2022-12-31T23:52:07+05:30 IST
మహిళలు స్వయంశక్తితో రాణించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గోవిందు నాగరాజు పేర్కొన్నారు.

కడప (మారుతీనగర్), డిసెంబరు 31: మహిళలు స్వయంశక్తితో రాణించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గోవిందు నాగరాజు పేర్కొన్నారు. శనివారం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో గా యత్రి మహిళా స్వయం సహాయక సేవా సంఘం సారధ్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం స్థానిక అక్కాయపల్లెలో నూతనంగా ఏర్పాటుచేసిన ఉచిత టైలరింగ్ శిక్షణకు ఆయన హాజరయ్యారు. సుమారు 45 రోజుల పాటు ఉచిత టైలరింగ్ శిక్షణ ఉంటుందని, పట్టుదలతో మహిళలు నేర్చుకోవాలని నెహ్రూ యువకేంద్ర జిల్లా యువ అధికారి కె. మణికంఠ సూచించారు. ప్రతి మహిళా ఖాళీ సమయంలో టైలరింగ్ నేర్చుకొని మీ అవసరాలకు భర్తలపై ఆధారపడకుండా ఉండేలా జీవించవచ్చన్నారు. కార్యక్రమంలో నగర ఉప మేయర్ ముంతాజ్‌బేగం, బీసీ నాయకురాలు వెంకటసుబ్బమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Read more