ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-02-20T04:38:18+05:30 IST

మండలంలోని దేవగుడిపల్లె గ్రామ పంచాయతీ పెట్రోల్‌బంకు సమీపంలోని గుట్ట దగ్గర తమ్మిశెట్టి గీత (44) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

చిన్నమండెం, ఫిబ్రవరి 19: మండలంలోని దేవగుడిపల్లె గ్రామ పంచాయతీ పెట్రోల్‌బంకు సమీపంలోని గుట్ట దగ్గర తమ్మిశెట్టి గీత (44) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు... గత కొంత కాలంగా  తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి కడుపు నొప్పి అని చెప్పి పడుకుంది. ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర కడుపు నొప్పితో.. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more