వన్యప్రాణులను సంరక్షించాలి

ABN , First Publish Date - 2022-10-08T04:44:05+05:30 IST

వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోరుమామిళ్ల ఫారెస్టు రేంజర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు.

వన్యప్రాణులను సంరక్షించాలి

పోరుమామిళ్ల,  అక్టోబరు 7 : వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోరుమామిళ్ల ఫారెస్టు రేంజర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు.  శుక్రవారం  ఆయన ఆధ్వర్యంలో కలసపాడు మండలంలోని ఎగువరామాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో వన్యప్రాణుల వారోత్సవాలను ఘనంగా   నిర్వహించారు.  ఈ సందర్భంగా 8, 9,  10 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.  హెచ్‌ఎం మస్తాన్‌, ఫారెస్టు సెక్షన్‌ అధికారులు రమణయ్య, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T04:44:05+05:30 IST