వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2022-10-08T04:19:04+05:30 IST

వన్యప్రాణులను రక్షించడం మన అందరి బాధ్యత అని అట వీ శాఖ రేంజర్‌ ప్రసాద్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి ఓబులేసు పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
సిద్దవటంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల ర్యాలీ

సిద్దవటం, అక్టోబరు7: వన్యప్రాణులను రక్షించడం మన అందరి బాధ్యత అని అట వీ శాఖ రేంజర్‌ ప్రసాద్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి ఓబులేసు పేర్కొన్నారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల్లో భా గంగా ప్రజలకు అటవీ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. అనంతరం కార్యాల యం నుంచి హైస్కూల్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అక్టోబరు మొదటి వారం లో దేశమంతటా జంతు ప్రపంచ వారోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీ అని ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు జంతువుల సంరక్షణ గురించి అవగాహన కల్పి స్తామన్నారు. అడవిలోని విలువైన సంపదను నాశనం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అడవి జంతువులను వేటాడకూడదని, వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో బీట్‌ఆఫీసర్లు రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:19:04+05:30 IST