-
-
Home » Andhra Pradesh » Kadapa » Why are MDU vehicles not moving-MRGS-AndhraPradesh
-
ఎండీయూ వాహనాలు ఎందుకు తిరగడం లేదు
ABN , First Publish Date - 2022-09-14T04:18:33+05:30 IST
గుర్రంకొండ మండలంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఎందుకు తిరగడం లేదని జాతీయ ఆహార భద్రత చట్టం సలహా సంఘం సభ్యుడు జీ.ఎన్.శర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర బృందం సభ్యుడు జీఎన్ శర్మ
గుర్రంకొండ / మదనపల్లె అర్బన్, సెప్టెంబరు 13: గుర్రంకొండ మండలంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఎందుకు తిరగడం లేదని జాతీయ ఆహార భద్రత చట్టం సలహా సంఘం సభ్యుడు జీ.ఎన్.శర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన గుర్రంకొండలోని రెండు రేషన్ దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థపై వివరాలు సేకరించారు. గుర్రంకొండ మండలంలో 9 ఎండీయూ వాహనాలు ఉండగా కేవలం 4 వాహనాలు మాత్రమే పనిచేస్తున్నాయని, 5 వాహనాలకు సంబంధించిన ఆపరేటర్లు రాజీనామా చేసినట్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన వాహనాలు తిరగడానికి ఎందుకు ఇతరులను నియమించలేదని సీఎ్‌సడీటీపై మండిపడ్డారు. వెంటనే వాహనాలు తిరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణమోహన్, ఆర్‌ఐ చంద్రమోహన్, వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆయన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించి కార్డుదారులతో మాట్లాడారు. ఎక్కడైనా రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో రఘురాం, డీఎం సూర్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాసులు, సీఎ్‌సడీటీ రెడ్డెప్ప, డీలర్ ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.