ఎప్పుడేం జరుగుతుందో...?

ABN , First Publish Date - 2022-09-20T05:00:45+05:30 IST

పీలేరు ఆర్టీసీ బస్టాండులోని పైకప్పు శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతోంది. అది ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు.

ఎప్పుడేం జరుగుతుందో...?
తిరుపతి పాయింట్‌లో కింద పడ్డ పైకప్పు పెచ్చులు

పెచ్చులూడుతున్న బస్టాండు పైకప్పు 

ప్రాణనష్టం జరిగితేగానీ పట్టించుకోరా!


పీలేరు, సెప్టెంబరు 19: పీలేరు ఆర్టీసీ బస్టాండులోని పైకప్పు శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతోంది. అది ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. సోమవారం ఉదయం తిరుపతి పాయింట్‌ వద్ద పెద్దఎత్తున పెచ్చులూడి కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదేవిధంగా బస్టాండులోని కంట్రోల్‌ పాయింట్‌ వద్ద కూడా 2018లో ఇదేవిధంగా పైకప్పు ఊడిపడింది. అప్పటి నుంచి కూడా ఆర్టీసీ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే గానీ అధికారులు పట్టించుకోరా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.Read more