-
-
Home » Andhra Pradesh » Kadapa » What actions are taken even if complaints are made against the authorities-MRGS-AndhraPradesh
-
అధికారులపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఏవీ?
ABN , First Publish Date - 2022-08-18T05:24:55+05:30 IST
జమ్మలమడుగులో సకలం అవినీతిమయంగా మారిందని, అవినీతి అధికారులపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ప్రతి స్పందన లేదని, కనీసం విచారణ చర్యలు కూడా లేవని.. ఇదేం ప్రభుత్వమని మాలమహానాడు రాష్ట్ర, జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర, జిల్లా మాలమహనాడు నాయకుల బృందం
జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 17: జమ్మలమడుగులో సకలం అవినీతిమయంగా మారిందని, అవినీతి అధికారులపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ప్రతి స్పందన లేదని, కనీసం విచారణ చర్యలు కూడా లేవని.. ఇదేం ప్రభుత్వమని మాలమహానాడు రాష్ట్ర, జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర మలమాహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్, గౌరవాధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు కలిసి అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వ అధికారులపై, ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. జమ్మలమడుగు ఆర్డీవో, తహసీల్దారు డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికారులపై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు లేవన్నారు. జమ్మలమడుగులో భూకబ్జాలు, పోలీసుల అండదండలతో జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఇసుక మాఫియా, భూకబ్జాలు, మట్కా, గుట్కా, పేకాట, వ్యభిచారం సక లం రాజ్యమేలుతుందని విమర్శించారు. సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేస్తే దళితుల పట్ల ఆ అధికారులే వివక్ష చూపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరు మారి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. దోపిడీ దొంగలు పెరిగారని, దళితులకు ఒకటిన్నర సెంటు స్థలం ఇవ్వడానికి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, అగ్రవర్ణాలవారు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తున్నా పట్టించుకునే అధికారి లేరన్నారు. కడపలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే జమ్మలమడుగులోని వీఆర్వో సిద్దయ్య పట్టించుకోకుండా దళితులకే ఫోన్లు చేసి బెదిరించారని, స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సంబందిత సీఐ స్పందించలేదన్నారు. మాలమహానాడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వరలక్ష్మి మాట్లాడుతూ దళితుల్లో ఐకమత్యం రావాలన్నారు. గతంలో ముఖ్యమంత్రులు దళిత సంక్షేమం కోసం పథకాలు పెట్టి అభివృద్ధికోసం పాటుపడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, దళిత నాయకులు వెంకటస్వామి, వెంకటరమణ, ఓబన్న, మర్రిప్రకాశం, నెల్సన్, ప్రసాద్, కొట్టాల బాష, జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు.