అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి

ABN , First Publish Date - 2022-03-19T05:05:59+05:30 IST

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధారాణి అధికారులకు సూచించారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి
ఆస్పత్రిలో ఏఎనఎంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

కలసపాడు, మార్చి 18 : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధారాణి అధికారులకు సూచించారు. మండల కేంద్రమైన కలసపాడులోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్యసమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  అనంతరం అన్ని శాఖ లపై సమీక్ష నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలదేవి, జడ్పీటీసీ గురివిరెడ్డి, ఎంపీడీవో జానవెస్లీ, సర్పంచలు, అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

 ప్రజాప్రతినిధుల బంధువులదే హవా 

మండల సర్వసభ్యసమావేశంలో ప్రజాప్రతినిధుల బంధువులదే హవా కొనసాగింది. ఎంపీపీ భర్త నారాయణ, జడ్పీటీసీ కొడుకు గురివిరెడ్డి, మహిళా ఎంపీటీసీల తరు పున వారి భర్తలు,  సర్పంచల తరుపున వారి భర్తలు సమస్యలపై అధికారులను వివరాలు అడుగుతూ కనిపించారు. ఈ విషయమై ఎంపీడీవో జానవెస్లీని వివరణ కోరగా మీకు తెలియంది కాదని సమాధానం ఇచ్చారు. 

 సమయపాలన పాటించాలి

మండల కేంద్రమైన కలసపాడులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఏఎనఎం, సీహెచవో, పెండ్లిమర్రి సర్పంచ రమణమ్మ, నాయకులు గురివిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

 పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలి 

బద్వేలు రూరల్‌, మార్చి 18 : పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలని ఎం పీపీ బిజివేముల రమణమ్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో ఎంపీడీవో రామకృష్ణయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల ద్వారా రూ.35 వేల తక్షణమే రుణ రూపంలో అం దజేయడం జరుగుతోందన్నారు. దాదాపు మండల పరిఽధిలో 910 మందికి ఇళ్ల నిర్మాణాలు మంజూరు కాగా వారి లో 602 మంది డ్వాక్రా సంఘ గ్రూపులలో ఉన్నారన్నారు.     జడ్పీటీసీ వంకెల చిన్నపోలిరెడ్డి, బిజివేముల రామసుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-19T05:05:59+05:30 IST