‘ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే పోరాటాలు ఆపేస్తాం’

ABN , First Publish Date - 2022-09-14T04:38:14+05:30 IST

ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే తాము పోరాటాలు ఆపేస్తామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుధాఅంకిరెడ్డి, మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి అన్నారు.

‘ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే పోరాటాలు ఆపేస్తాం’

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 13 : ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే తాము పోరాటాలు ఆపేస్తామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుధాఅంకిరెడ్డి, మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఆ పార్టీ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం పాపాఘ్ని నది నుంచి కమలాపురం,  చదిపిరాళ్ల చెరువులకు నీటిని మళ్లించేందుకు తమ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి తన సొంత నిధులతో పనులు చేయిస్తున్నారన్నారు.  సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు చేయాలని, అయితే కమలాపురం నియోజకవర్గంలోని నాయకులు కేవలం కమిషన్ల కోసం మాత్రమే పని చేస్తున్నారన్నారు.  పా పాఘ్ని నది పై వరదలకు వంతెన దెబ్బతిని కూలిపోయి ఏడాది అవుతున్నా ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం ఇంత వరకు ఏమీ చేయలేదన్నారు. అప్పారావుపల్లెలో చెక్‌డ్యాం నిర్మాణం మంజూరు అయితే కేవలం కమిషన ఇవ్వలేదనే నెపంతో ఆపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమలో ప్రభుత్వ ఆస్పత్రి మాజీ చైర్మన జంపాల నరసింహారెడ్డి, కాపునాడు మల్లే్‌షరాయల్‌, జిల్లా బీసీ ఉపాద్యక్షులు శంకర్‌యాదవ్‌, మండల ప్రధాన కార్యదర్శి గుజ్జుల నారాయణయాదవ్‌, సీతారామయ్య, వాసుదేవుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T04:38:14+05:30 IST