జగన్‌ మోసాలను ప్రజలకు వివరిస్తాం..

ABN , First Publish Date - 2022-03-17T05:03:47+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సాగించిన 33 నెలల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు తెలియపరచేందుకే ఈనెల 19న కడపలో రాయలసీమ రణభేరి బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.

జగన్‌ మోసాలను ప్రజలకు వివరిస్తాం..
ప్రచార రథాలను ప్రారంభిస్తున్న బీజేపీ నేతలు

రణభేరి ప్రచార రథాల ప్రారంభోత్సవంలో బీజేపీ నేతలు

కడప మారుతీనగర్‌, మార్చి 16: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సాగించిన 33 నెలల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు తెలియపరచేందుకే ఈనెల 19న కడపలో రాయలసీమ రణభేరి బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు రణభేరి ప్రచార రథాలను ప్రారంభించి మాట్లాడారు. రణభేరి జరుగుతున్న విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా ప్రచార రఽథాలు మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి వివరించాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్‌రెడ్డి ప్రజలను నమ్మించి ఇవాళ నట్టేట ముంచారని నిప్పులు చెరిగారు. 

Read more