కోర్టు ఉత్తర్వులకు లోబడే ఇళ్లను కూల్చివేశాం

ABN , First Publish Date - 2022-12-07T23:26:54+05:30 IST

హైకోర్టు ఉత్తర్వులకు లోబడి వాజ్‌పేయినగర్‌లో పట్టాభూములు ఆక్రమించి నిర్మించిన ఆవాసాలను కూల్చివేశామని ఆర్‌డీఓ శ్రీనివాసులు తెలిపారు.

కోర్టు ఉత్తర్వులకు లోబడే ఇళ్లను కూల్చివేశాం

నేటి నుంచి శిథిలాల తొలగింపు

అడ్డుకుంటే క్రిమినల్‌ కేసులు - ఆర్‌డీఓ శ్రీనివాసులు

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 7: హైకోర్టు ఉత్తర్వులకు లోబడి వాజ్‌పేయినగర్‌లో పట్టాభూములు ఆక్రమించి నిర్మించిన ఆవాసాలను కూల్చివేశామని ఆర్‌డీఓ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ చర్యలపై కొన్ని పార్టీలు, ప్రజా, కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్లు రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని కూల్చివేయ లేదన్నారు. ఫిబ్రవరిలో హైకోర్టు వాజ్‌పేయి నగర్‌లో ఆక్రమిత కట్టడాలు తొలగించమని ఆదేశించిందన్నారు. ఖాళీ చేయడానికి వారికి ఆరునెలల గడువు సైతం ఇచ్చిందన్నారు. తీర్పు ఇచ్చిన రోజు నుంచి మేము వారిని ఖాళీ చేయాలని తెలియ పరిచామన్నారు.

వారికి కొత్తపల్లె జగనన్న కాలనీలో ఇంటి పట్టా లు ఇచ్చామని, నిర్మాణానికి రుణాలు సైతం మంజూరు చేశామన్నారు. కానీ వారు కొందరి మాటలు విని మొండిగా వ్యవహరించి బలవంతంగా వారిని ఖాళీ చేయించేపరిస్థితి తెచ్చుకున్నారన్నారు. కొందరు సంఘాల నేతలు కోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడుతున్నారనిమీ ప్రతి చర్య కోర్టు ధిక్కారం కింద కు వస్తుందన్నారు. కోర్టు తీర్పునకు విరుద్దంగా శిఽథిలాల వద్ద టెంట్లు వేసుకుని వున్నారని, సంఘాల నేతలు సహకరించడం సరి కాదన్నారు. గురువా రం నుంచి శిఽథిలాలు తొలగించి పట్టా భూములను యజమానులకు అప్పగిం చే పనులు జరుగుతాయన్నారు. ఈ పనులను ఎవరు అడ్డుకున్నా కోర్టు ధిక్కారం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-07T23:26:55+05:30 IST