కష్టపడి పనిచేస్తున్నాం.... కక్షసాధింపు ఎందుకు?

ABN , First Publish Date - 2022-07-06T05:04:24+05:30 IST

వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాం... కానీ తమ కుటుంబంపై కక్షసాధింపు ఎందుకు చేస్తున్నారని పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు రామనాదుల ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి పనిచేస్తున్నాం.... కక్షసాధింపు ఎందుకు?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పగిడాల ఎంపీటీసీ ప్రభావతి

ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతి


కడప, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాం... కానీ తమ కుటుంబంపై కక్షసాధింపు ఎందుకు చేస్తున్నారని పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు రామనాదుల ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్త, మాజీ జడ్పీటీసీ భాస్కర్‌ ప్రొద్దుటూరులో సమస్య జరుగడంతో మంగళవారం ఉదయం వెల్లాలలోని తమ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కూడా పాదయాత్రలో పాల్గొని అన్ని విధాలుగా పార్టీలో కష్టపడ్డామని, వైఎ్‌సఆర్‌ పార్టీలోనే ఎంపీటీసీగా గెలుపొందానని ఆమె తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా తమ కుటుంబంపై కక్షసాధింపు చేస్తున్నారని... నేను చేసే ద్రోహం ఏంటని ఆమె ప్రశ్నించారు. మా కుటుంబానికి ఏమి జరిగినా... ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బావమర్ధి కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, బీవీ ప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆయిల్‌మిల్‌ ఖాజా, వైఎస్‌ మహమ్మద్‌ గౌస్‌, మురళీధర్‌రెడ్డి, పొట్టు లక్ష్మిరెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

  

Read more