ఉద్యమంలో మేము సైతం: ఈయూ

ABN , First Publish Date - 2022-01-24T05:13:19+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమంలో తమ యూనియన్‌ ఉద్యోగులందరూ భాగస్వాములవుతారని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జీవీ నరసయ్య, జోనల్‌ అధ్యక్షుడు కె.కె. కుమార్‌ పేర్కొన్నారు.

ఉద్యమంలో మేము సైతం: ఈయూ

కడప (మారుతీనగర్‌), జనవరి 23: ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమంలో తమ యూనియన్‌ ఉద్యోగులందరూ భాగస్వాములవుతారని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జీవీ నరసయ్య, జోనల్‌ అధ్యక్షుడు కె.కె. కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద గల యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు విలీనానికి ముందున్న అన్ని సౌకర్యాలు కొనసాగించాలన్నారు. అలవెన్సులు, ఇన్‌సెంటివ్‌ యధావిధిగా కొనసాగించేలా చూడాలన్నారు. 2017 తర్వాత ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగాల్సిన పీఆర్సీ 2021లో నష్టపోతున్న కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపచేసి స్కేల్‌ ఫిక్సేషన్‌ చేయాలన్నారు. అలాగే పెండింగ్‌ లో ఉన్న 2017 పీఆర్సీ అరియర్స్‌ను గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు చెల్లించాలన్నారు. మెడికల్‌లో అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్లను చె ల్లించాలన్నారు. 30 రెగ్యులేషన్‌లో ఉన్న అన్ని క్యాటగిరీల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలన్నారు. సమావేశంలో జోనల్‌ కార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Read more