నీటి వనరులను పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-08-16T05:42:42+05:30 IST

నీటి వనరులను పెం పొందించేందుకు చెరువులను అభివృద్ధి చే యాల్సిన అవసరం స్థా నిక ప్రజలు, ప్రజాప్రతినిధులపై, అధికారుల పై ఉంటుందని జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు.

నీటి వనరులను పెంపొందించాలి
కొప్పర్తి చెరువు వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న కలెక్టర్‌ విజయరామ రాజు, తదితరులు

సీకేదిన్నె, ఆగస్టు 15: నీటి వనరులను పెం పొందించేందుకు చెరువులను అభివృద్ధి చే యాల్సిన అవసరం స్థా నిక ప్రజలు, ప్రజాప్రతినిధులపై, అధికారుల పై ఉంటుందని జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు. ఆజాదికా అమృత్‌శ్రీ సరోవర్‌ పథకంలో భా గంగా సోమవారం చిం తకొమ్మదిన్నె మండలం కొప్పర్తి చెరువు అభివృద్ధి పనులను స్వాతంత్య్ర దినోత ్సవం సందర్భంగా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి, జలవనరులు, అటవీశాఖ ద్వారా జిల్లాలో 130 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అమృత్‌ సరోవర్‌ పథకం కింద గత ఒకటిన్నర నెలలుగా ప్రారంభించిన అభివృద్ధి పనులను, 43 చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ అమృత్‌ సరోవర్‌ పథకం కింద జిల్లాలో అభివృద్ధి చేసిన 43 చెరువుల వద్ద ఈనెల 11 నుంచి 15 వరకు తిరంగ మార్చ్‌ శానిటైజేషన్‌, దేశ నాయకుల చిత్రపటాలను విద్యార్థుల ద్వారా నీటి సంరక్షణ స్లోగన్స్‌ వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించామన్నారు.  

Updated Date - 2022-08-16T05:42:42+05:30 IST