డ్రైనేజీ ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించండి
ABN , First Publish Date - 2022-06-26T05:25:01+05:30 IST
గుర్రం కొండలో హైవే రోడ్డు వెంబడి నిర్మించిన డ్రైనేజీ కాలువపై ఆక్ర మణలను స్వచ్ఛందంగా తొలగించాలని రెవెన్యూ, పం చాయతీ, ఎన్‌హెచ్ అధికారు లు పోలీసులతో కలిసి ఆక్ర మణదారులకు సూచించారు.

వ్యాపారులకు సూచించిన అధికారులు
గుర్రంకొండ, జూన్ 25:గుర్రం కొండలో హైవే రోడ్డు వెంబడి నిర్మించిన డ్రైనేజీ కాలువపై ఆక్ర మణలను స్వచ్ఛందంగా తొలగించాలని రెవెన్యూ, పం చాయతీ, ఎన్‌హెచ్ అధికారు లు పోలీసులతో కలిసి ఆక్ర మణదారులకు సూచించారు. శనివారం పట్టణంలో డ్రైనేజీ కాలువపై ఏర్పాటు చేసిన బం కులు, రేకుల షెడ్లు, తోపుడుబం డ్లు, ఆక్రమణల ను తొలగించాల ని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణలను తొలగించకుంటే ఎక్స్క వేటర్‌తో తొల గిస్తామని హెచ్చరించారు. అలాగే బస్టాండులో రోడ్డుకు ఇరువైపులా మినీ బస్ షెల్టర్ లను నిర్మిస్తామని ఎన్‌హెచ్ ఏఈ రఘునాథ్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగయ్య, ఆర్ఐ చంద్రశేఖర్, ఎన్‌హెచ్ ఏఈ రఘనాథ్‌బాబు, ఎస్ఐ దిలీప్‌కు మార్, ఈవో ఇబ్రహీం, సర్వేయర్ లక్ష్మీనారాయణ, వీఆర్వో నాగరాజ, నాయకులు జమీర్ అలీ ఖాన్, ఆరీఫ్బాషలు పాల్గొన్నారు.