నకిలీ స్టిక్కర్లతో తిరిగితే వాహనాలు సీజ్
ABN , First Publish Date - 2022-10-18T05:05:26+05:30 IST
పోలీస్, ప్రెస్, డాక్టర్.. ఇలా నగరంలో నకిలీ స్టిక్కర్లను తమ వాహనాలపై అతికించుకుని రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు.
కడప (క్రైం), అక్టోబరు 17 : పోలీస్, ప్రెస్, డాక్టర్.. ఇలా నగరంలో నకిలీ స్టిక్కర్లను తమ వాహనాలపై అతికించుకుని రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు ఇటువంటి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వాహనాల మీద నకిలీ స్టిక్కర్లను అతికించుకుని తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో నకిలీ స్టిక్కర్లు అని తేలితే మాత్రం ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు.. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.