గ్యాస్‌లీకై వ్యాన్‌ దగ్ధం

ABN , First Publish Date - 2022-04-25T04:50:40+05:30 IST

పార్కింగ్‌ చేసి ఉన్న ఓమ్నీ వ్యాన్‌లోని సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించి పూర్తి గా కాలిపోయింది.

గ్యాస్‌లీకై వ్యాన్‌ దగ్ధం
మంటలను అందుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్‌ 24: పార్కింగ్‌ చేసి ఉన్న ఓమ్నీ వ్యాన్‌లోని సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించి పూర్తి గా కాలిపోయింది. వినాయకనగర్‌ లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనపై వివరాల్లో కెళి తే... గణపతిసింగ్‌ ఓమ్మీవ్యాన్‌ను ఇంటికి సమీపంలో పార్కింగ్‌ చేశా డు. ఉన్నట్టుండి వ్యాన్‌ నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బం ది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే వ్యాన్‌ చాలా వరకు కాలిపోయింది. బ్యాటరీ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని, రూ.50వేలు నష్టం వాటిల్లినట్లు వ్యాన్‌ యజమాని తెలిపారు. గ్యాస్‌, బ్యాటరీ అధారిత వాహనాలను నీడపట్టున పార్కింగ్‌ చేసుకోవాలని, ఎండలో పార్కింగ్‌ చేస్తే ఎండ తీవ్రతతో ప్రమాదం జరిగే అవకాశం ఉంద ని ఫైర్‌ ఆఫీసర్‌ రఘునాధ్‌ సూచించారు.

Updated Date - 2022-04-25T04:50:40+05:30 IST