వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2022-10-18T04:27:30+05:30 IST
వాల్మీకిబో యలను ఎస్టీలుగా గుర్తించాలని వీఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్ చేశారు.
మదనపల్లె టౌన, అక్టోబరు 17: వాల్మీకిబో యలను ఎస్టీలుగా గుర్తించాలని వీఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసిం హులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర లోని ఐదు జిల్లాల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని, కాని మిగిలిన 8 జిల్లాల్లో బీసీలు గానే పరిగణిస్తున్నారన్నారు. దీని కోసం విజ యవాడలో ఏపీ వీబీఎస్ అధ్యక్షుడు ఈశ్వర య్య రిలే దీక్షలు చేపట్టి 15 రోజులైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కార్య క్రమంలో వీఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పులి శ్రీనివాసులు, కె.సాంబ, జయసింహ, కె.శ్రీనివా సులు, రమేశ, రామకృష్ణ పాల్గొన్నారు.