గేదెలకు బ్రూసెల్లోసిస్ టీకాలు
ABN , First Publish Date - 2022-03-06T04:49:38+05:30 IST
హత్యరాలలో గేదె దూడలకు శనివా రం బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకా లను డివిజనల్ ప శుసంవర్ధక ఉపసంచాలకులు డాక్టర్ అబ్దుల్ అరీఫ్ వే శా రు.
రాజంపేట, మార్చి5: హత్యరాలలో గేదె దూడలకు శనివా రం బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకా లను డివిజనల్ ప శుసంవర్ధక ఉపసంచాలకులు డాక్టర్ అబ్దుల్ అరీఫ్ వే శా రు. ఆ గ్రామంలోని 36 దూడలకు ఈ టీకా మందులు వేసినట్లు ఆయన తెలిపారు. పశు రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బ్రూసెల్లోసిస్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా టీకాలను లేగదూడలకు వేయాలన్నారు. కార్యక్రమంలో రాజంపేట ప్రాంతీయ పశువైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్ కె.చంద్రశేఖర్, హత్యరాల పశువైద్యాధికారి వి.వేదవతి, వరదయ్య, కె.భాను పాల్గొన్నారు.