రాజంపేటను జిల్లాగా ప్రకటించే వరకు తగ్గేదేలా....
ABN , First Publish Date - 2022-02-01T05:01:46+05:30 IST
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తగ్గేదేలా అంటూ జేఏసీ నేతలు పేర్కొన్నారు. సోమవారం చిట్వేలి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛం ద సంస్థల వారు నిరసన వ్యక్తం చేశారు.
చిట్వేలి, జనవరి 31 : రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తగ్గేదేలా అంటూ జేఏసీ నేతలు పేర్కొన్నారు. సోమవారం చిట్వేలి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛం ద సంస్థల వారు నిరసన వ్యక్తం చేశారు. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వైఎస్సార్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్ర సమర్పించి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాధాన్యం, సౌకర్యాలు ఉన్న ప్రాంతాన్ని కాదని వేరే చోట జిల్లా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వామపక్ష నాయకులు మానవతా, సీహెఛ్‌ఎ్‌స, శివశక్తి, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు.