గుర్తు తెలియని వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2022-10-18T05:06:29+05:30 IST

ఆనారోగ్యంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఓ వృద్దుడు సోమవారం మృతి చెందాడు.

గుర్తు తెలియని వృద్ధుడు మృతి
గుర్తుతెలియని వృద్ధుని శవం

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 17 : ఆనారోగ్యంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఓ వృద్దుడు సోమవారం మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల వివరాల మేరకు... ఈనెల 14న ఆనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధున్ని 108 సిబ్బంది అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. కాగా ఆ సమయంలో ఐపీ రిజిష్టర్‌లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన  బాషా అని పేరు నమోదు చేశారు. మృతుని వయస్సు 65 ఏళ్లు ఉంటుందని, మార్చురీలో మృతదేహం భద్రపరిచామని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే, ఆస్పత్రి అవుట్‌పోస్టు విభాగంలో సంప్రదించాలని వారు తెలిపారు. 

 

Updated Date - 2022-10-18T05:06:29+05:30 IST