ఐక్యతే అభివృద్ధికి సోపానం
ABN , First Publish Date - 2022-01-24T05:17:24+05:30 IST
ఐక్యతే అభివృద్ధికి సోపానం అని ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి చిదానందగౌడ్ పేర్కొన్నారు.
కడప (మారుతీనగర్), జనవరి 23: ఐక్యతే అభివృద్ధికి సోపానం అని ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి చిదానందగౌడ్ పేర్కొన్నారు. 2022 నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం జిల్లా ఈడిగ (గౌడ) సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కంపరాజు రవిశంకర్‌గౌడ్ సారథ్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి చిదానందగౌడ్ హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని ఈడిగ (గౌడ) వర్గీయులు ఇతర వర్గాలవలే అభివృద్ధివైపు అడుగులు వేసేందుకు ఐక్యతతో ముందుకురావాలన్నారు.