వైభవంగా ఆస్థాన ఏ మురాదియా దర్గా ఉరుసు
ABN , First Publish Date - 2022-12-07T00:06:34+05:30 IST
కడప నగరంలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన ఆస్థాన ఏ ము రాదియా దర్గా 134వ ఉరుసు ఉత్సవాల కార్యక్రమాన్ని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా మొహమ్మద్ జమాలుల్లా బాష సాహె బ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
కడప(కల్చరల్), డిసెంబరు 6: కడప నగరంలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన ఆస్థాన ఏ ము రాదియా దర్గా 134వ ఉరుసు ఉత్సవాల కార్యక్రమాన్ని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా మొహమ్మద్ జమాలుల్లా బాష సాహె బ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి ఇంటి నుంచి భారీ పూలచాందినీని మెరవణితో పకీర్ల మేళతాళాల విన్యాసాలతో దర్గా వద్దకు చేరి దర్గాలో పూలచాందిని సమర్పించి, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మురాదియా భక్తాదులు, ప్రజలు పాల్గొన్నారు.