రెండు ద్విచక్రవాహనాలు ఢీ: వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-12-09T23:34:49+05:30 IST

రెండు ద్విచక్ర వాహనాలు ఎదు రెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో చిన్నమల్లయ్య(60) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవా రం తంబళ్లపల్లె మండలంలో చో టుచేసుకుంది.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ: వ్యక్తి మృతి  మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె, డిసెంబరు 9: రెండు ద్విచక్ర వాహనాలు ఎదు రెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో చిన్నమల్లయ్య(60) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవా రం తంబళ్లపల్లె మండలంలో చో టుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని ఆర్‌ఎన తాండా పంచాయతీ ఎద్దులవేమన్నగారిపల్లెకు చెందిన చిన్నమల్లయ్య శుక్రవారం సొంత పనుల నిమిత్తం తంబళ్లపల్లెకు వచ్చి పనులు ముగిం చుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరి వెళుతుండగా గోపిదిన్నె పంచాయతీ ఉప్పులూరివాండ్లపల్లెకు చెందిన రమణ నాయక్‌(50) ద్విచక్రవాహనంలో తంబళ్లపల్లెకు వస్తూ రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నమల్లయ్య తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా, రమణనాయక్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రమణనాయక్‌ను 108లో తంబళ్లపల్లె సీహెచసీకి తరలించి ప్రథమ చికిత్స అందిం చారు. బాధితునికి మొరుగైన వైద్య చికిత్స అవసరమవడంతో వైద్యుల సూచనల మేరకు మదనపల్లె జిల్లా వైద్యశాలకు రెఫర్‌ చేశారు.

మద్యం తాగడానికి డబ్బివ్వలేదని

తల్లిపై తనయుడి దాడి

పీలేరు, డిసెంబరు 9: దుర్వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు తన వ్యసనాల కోసం అవసరమైన డబ్బు ఇవ్వలేదనే కోపంతో తల్లి పైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పీలేరు పంచాయతీ కార్యాలయంలో బొజ్జమ్మ (56) పారిశుధ్య కార్మికు రాలిగా పనిచేస్తోంది. ఆమె కుమారుడు సతీష్‌ వ్యసనాలకు బానిసై అవసరమైన డబ్బు కోసం శ్రీనాథపురం కాలనీలోని ఇం టిని కూడా అమ్మించాడు. ఈ డబ్బు కోసం తల్లిని తరచూ వేధించడం పరిపాటిగా మారింది. అయితే డబ్బు ఇవ్వడానికి బొజ్జమ్మ నిరాకరించడంతో ఆమెను సతీష్‌ శుక్రవారం కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో బొజ్జమ్మ తలకు తీవ్ర గాయాలు కావడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బొజ్జమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్టు

వాల్మీకిపురం, డిసెంబ రు 9: ద్విచక్రవాహనాల చోరీలు, వివిధ కేసు లలో నిందితులను శుక్ర వారం వాల్మీకిపురం పో లీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా రాయ చోటి డీఎస్పీ శ్రీధర్‌ కథనం మేరకు..ములకలచెరువు మండలం చౌడసముద్రం గ్రామం కొత్తపల్లెకు చెందిన సల్లా శ్రీరాములు(30), తిరుపతి పద్మావతిపురంకు చెందిన దేవరకొం డ జాను(20) ఇరువురు కలిసి మదనపల్లె టౌన చంద్రాకాలనీ లో నివాసం ఉంటున్నారు. వారిద్దరూ చింతపర్తి సమీపంలోని జమ్మళ్లపల్లె, చింతలవారిపల్లె రోడ్డు, వాల్మీకిపురం, తదితర ప్రాంతాలలో ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. అలాగే స్థానిక తిరుపతి రోడ్డులోని యల్లమ్మ గుడిలో ఆభరణాలు, నగదు, పీలేరు సమీపంలోని నాలేవాండ్లపల్లె ప్రాంతంలో ఓ గుడిలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇద్దరూ అనుమానాస్పదంగా తిరు గుతుండగా స్థానిక సీఐ సురేష్‌, ఎస్‌ఐ బిందుమాధవిలు సిబ్బం దితో కలిసి అరెస్టు చేసి వారి నుంచి 3ద్విచక్రవాహనాలు, బంగా రు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనం తరం నింధితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరుపరి చారు. దొంగతనాల కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ హర్షవర్దనరాజు, డీఎస్పీ శ్రీధర్‌లు అభినందించారు. కేసు ఛేదనలో హెడ్‌కానిస్టేబుల్‌ దస్తగిరి, సతీష్‌కుమార్‌, రామాంజు లు, రెడ్డిప్రసాద్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:34:53+05:30 IST