రెండు కార్లు ఢీ. .. ఒకరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-03-05T05:12:53+05:30 IST

మండలంలోని మారెళ్లమడక సచివాలయం వద్ద శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదం లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ తెలిపారు.

రెండు కార్లు ఢీ. .. ఒకరికి తీవ్రగాయాలు
ప్రమాదంలో పల్టీకొట్టిన కారు

చక్రాయపేట, మార్చి 4: మండలంలోని మారెళ్లమడక సచివాలయం వద్ద శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదం లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ తెలిపారు. లక్కిరెడ్డిపల్లె గంగమ్మ జాతర నుంచి ఒక కారు, తలుపుల మండలం వేపమానుతోట నుంచి మరోకారు వస్తుండగా మారెళ్లమడక వద్ద రెండు ఢీకొన్నాయి. దీంతో ఓకారు మూడు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తు న్నయశోదమ్మకు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్‌ రవీంద్ర, అమర్‌నాథ్‌, ప్రతా్‌పలకు స్వల్పగాయాలయ్యాయి. చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి, కార్లను స్టేషన్‌కు తరలించారు.

మోటార్‌ బైక్‌ ఢీకొని వ్యక్తికి గాయాలు 

పోరుమామిళ్ల, మార్చి 4 : ఏపీ 39 ఎల్‌ఆర్‌ 1643 నెంబర్‌ గల మోటార్‌ బైకు ఎదురుగా వస్తున్న మోటర్‌బైకును ఢీకొనడంతో అల్లాబాయిగారి షఫీకి తీవ్ర గాయాలు అయ్యాయని ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.  మోటార్‌బైక్‌ వెళుతున్న షఫీని కొమ్మరోలుకు చెందిన వ్యక్తి అతివేగంగా వాహనం నడిపి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన వ్యక్తిని వారి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం అతని కుమారుడు అల్లాబాయిగారి దాదాపీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more