-
-
Home » Andhra Pradesh » Kadapa » Tribute to Dr MVR-MRGS-AndhraPradesh
-
డాక్టర్ ఎంవీఆర్‌కు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-10-01T05:26:03+05:30 IST
రాయలసీమ ఉద్యమ నేత, రాయలసీమ సమగ్ర విషయ పరిజ్ఞాని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు ఘన నివాళులర్పించారు.

కాంస్య విగ్రహం ఆవిష్కరణ
పలువురు ప్రముఖుల హాజరు
ప్రొద్దుటూరు రూరల్, సెప్టెంబరు 30 : రాయలసీమ ఉద్యమ నేత, రాయలసీమ సమగ్ర విషయ పరిజ్ఞాని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు ఘన నివాళులర్పించారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ, లింగాపురంలోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం డాక్టర్ ఎంవీఆర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎంవీఆర్ అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల మాట్లాడుతూ ఎంవీఆర్ వైద్యునిగా, న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, అనువాదకునిగా, పత్రికా సంపాదకునిగా, విమర్శకునిగా రాయలసీమ ఉద్యమ నాయకునిగా, రాయలసీమ సమగ్ర విషయ పరిజ్ఞానిగా, విద్యా సంస్థల వ్యవస్థాపకునిగా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. ఆయన చ నిపోయే ముందు కూడా మానవ జాతి చరిత్రపై ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ రాయడం, సాహిత్యం పట్ల, రచనల పట్ల ఆయనకున్న మక్కువ అర్థమవుతుందన్నారు. రాయలసీమ అస్తిత్వ వాసిగా ఎంవీఆర్ ఆశయాలు నెరవేరేందుకు ఎవరి వంతు కృషి వారు చేస్తేనే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఎంపీ మాట్లాడుతూ 2019 సంవత్సరంలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డిని తాను మొదటిసారిగా కలిశానన్నారు. తనకు రాయలసీమ కన్నీటి గాధ అనే పుస్తకాన్ని అందించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. ఎంవీఆర్ ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో తమతో పాటు ఎంవీఆర్ కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలన్నారు. అనంతరం ఎంవీఆర్ స్మృతిసంచికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఏపీఎ్సఎ్సబీసీ అడ్వయిజర్ చల్లా మధుసూధన్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్‌బాబు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి, భూమన్, తాడి ప్రకాశ్, అప్పిరెడ్డి హరినాఽథరెడ్డి, ఎంవీఆర్ తనయులు మల్లెల మురళీధర్‌రెడ్డి, మాజీ ఉప ఎంపీపీ మల్లెల రాజారామిరెడ్డి, ఎంవీఆర్ కోడళ్లు మల్లెల ఉమ, మల్లెల కాంతమ్మ, ఆప్కాబ్ చైౖర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, మల్లెల గౌతంరెడ్డి, ఎంపీపీ సానబోయిన శేఖర్‌యాదవ్, వైసీపీ జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి, లింగాపురం ధనికెల వీర ప్రతా్పయాదవ్, బయన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.